రాహుల్ గాంధీ పోరాటం ఆగదు
బోథ్,(విజయక్రాంతి): ఎస్ఐఆర్లో ఏ ఒక్క ఓటరు అన్యాయం(Voter Justice,) జరగవద్దని రాహుల్ గాంధీ(Rahul Gandhi) పోరాటం చేస్తున్నారని ఆయన పోరాటం న్యాయం జరిగేంత వరకు ఆగదని కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి అచ్చితానంద రెడ్డి(Congress spokesperson Achithananda Reddy) పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ సామాజిక న్యాయం ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల నిరుద్యోగం రైతుల సమస్యలపై బిజెపి సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. ప్రతి ఒక్కరి ఓటును కాపాడాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. కులం మతం పేరుతో రాజకీయాలు చేయడం సరైనది కాదని పేర్కొన్నారు. ప్రజలకు బిజెపి సమాధానం చెప్పలేక అక్రమ అరెస్టు లకుపాల్పడుతుందన్నారు.