సమాజ సేవలో చురుగ్గా పని చేయాలి

06-10-2026 | 05:27pm

రెడ్ క్రాస్ సొసైటీ నూతన సభ్యులకు కలెక్టర్ సూచన...

ఆదిలాబాద్, అక్టోబర్ 06, (విజయక్రాంతి) : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ(Indian Red Cross Society) జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తరించి పేదలు, బాధితులు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah) సూచించారు. నూతనంగా ఎన్నికైన రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆడే క్రాంతి కుమార్ తోపాటు కార్యవర్గ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్ ను ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌కు పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టనున్న రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, అత్యవసర సమయాల్లో బాధితులకు సహాయ చర్యలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా, సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.

సమాజ హితం కోసం నూతన కార్యవర్గం అంకితభావంతో పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అదనపు కలెక్టర్ ఆర్‌.ఎస్‌. చిత్రు, సొసైటీ సభ్యులు మనోహర్, రాథోడ్ జైసింగ్, సునీత, పార్థసారథి, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు