తాత్కాలిక బాణసంచా దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

06-10-2026 | 08:54pm

పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం..

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక బాణసంచా విక్రయ దుకాణాలు ఏర్పాటు చేసుకునే వ్యాపారులు ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం(Police Commissioner Gaush Alam) ఒక ప్రకటనలో తెలిపారు. క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లు, నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అర్హులైన వారికి అనుమతులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.

వ్యాపారులు నిర్ణీత దరఖాస్తు ఫారంతో పాటు, ఆధార్ కార్డు, ఎస్ఎస్ఎస్సి మార్కుల మెమో, సంబంధిత శాఖల నిరభ్యంతర పత్రాలు  5 సెట్ల జిరాక్స్ ప్రతులను కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అక్టోబర్ 17 లోపు అందజేయాలి. అక్టోబర్ 17వ తేదీ సాయంత్రం తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు