ప్రభుత్వం పి ఆర్ సి నివేదికను తెప్పించి అమలు చేయాలి

28-10-2026 | 05:42pm

బోథ్. అక్టోబర్ 28 ( విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి(State Government PRC) నివేదికను తెప్పించి వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జాప్యం  చేయకుండా కార్యాచరణ ప్రారంభించాలన్నారు. మన కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపించాలని కోరారు.

ఉపాధ్యాయుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఏ కీకృతసర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో 190 అమలు చేయాలని, ఎంప్లాయిస్ నూతన హెల్త్ కి ంగ్ పారదర్శన్ గారు అమలు చేసి క్షేత్రస్థాయిలో నెలకొన్న ఇబ్బందులను తొలగించాలని ఆయన కోరారు.

జిపిఎస్ రద్దు పై అధ్యయన కమిటీ వేయాలని డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పండిత్ ఈ కిలను వెంటనే ఈమోడల్ గురుకుల ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులను ,0 10 ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

జీవో 25 తక్షణమే అమలు చేయాలని సమగ్ర శిక్ష గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి టైమ్ స్కేల్ విధానం అమలు చేయాలన్నారు. సమావేశంలో సంఘంలో రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ఎం పర్వత్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు మూగ శ్రీనివాస్, రాష్ట్ర బాధ్యులు జాదవ్ అశోక్ బి రవీంద్ర పుప్పాల నరేందర్, చిలక విలాస్ ,సునీల్ పాషా, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరసయ్య భూమేషులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు