గ్రామపంచాయతీ కార్యాలయాలను సందర్శించిన ట్రైన్ డిప్యూటీ కలెక్టర్
బోథ్. అక్టోబర్ 15 ( విజయక్రాంతి) మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం తో పాటు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ట్రైని డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణారెడ్డి(Trainee Deputy Collector Vamsikrishna Reddy) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మండల పరిషత్ అభివృద్ధి అధికారి విధులు బాధ్యతలు అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివిజి రాంజీ పథకం అమలు తీరును ఎంపీడీవో ఎల్ రమేష్ ను అడిగి తెలుసుకున్నారు.
మూడు వారాలపాటు ఎంపీడీవో వద్ద శిక్షణ పొందడం జరుగుతుంది. అంతేగాక వివిజి రాంజీ పథకం అమలు తీరు గురించి రాంజీ సిబ్బందిని గ్రామపంచాయతీ కార్యదర్శుల పాత్ర ,బాధ్యతల గురించి తెలుసుకున్నారు. అనంతరం గ్రామపంచాయతీని సందర్శించి భవిష్యత్తులో మంచినీటి ఎద్దడి రాకుండా తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఇంకుడు గుంతల నిర్మాణం ప్రతి ఇంట నిర్మించే విధంగా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ వార్డు సభ్యులతో కలిసి ట్రైన్ డిప్యూటీ కలెక్టర్ సన్మానించారు.