నీటిని పొదుపుగా వాడుకోండి

15-10-2026 | 07:43pm

బోథ్. అక్టోబర్ 15 ( విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావం(Impact of El Niño) వల్ల వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకకపోవడం వల్ల వేసవికాలం లో తీవ్ర మంచినీటి ఎద్దడి ఎదురయ్యే ఆస్కారం ఉన్నందున ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని బోత్ గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ అల్లకొండ పోతన్న పిలుపునిచ్చారు. నీటిని వృధా చేయవద్దని, రోడ్లపై నీరు ప్రవహిస్తే గ్రామపంచాయతీ దృష్టికి తీసుకురావాలన్నారు.

అంతేగాక నీటి పొదుపును ప్రజలు అలవర్చుకోవాలని లేకుంటే వేసవిలో త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉందన్నారు. పైప్ లైన్ లీకేజీ అయితే విడిసి లేదా గ్రామ పంచాయతీ వారికి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే వేసవి కాలంలో త్రాగునీటికి ఇబ్బందులు తప్పే విధంగా లేవని ఆందోళన వ్యక్తపరిచారు. నీటి పొదుపు పై ప్రభుత్వం ప్రజలను చైతన్యం చేస్తున్నదని అధికారుల ఆదేశాలను పాటించాలన్నారు.

మరిన్ని వార్తలు