ప్రజల సుఖసంతోషాల కోసం దుర్గామాతకు ప్రత్యేక పూజలు

15-10-2026 | 08:24pm

ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగల ముందస్తు శుభాకాంక్షలు

ధన్వాడలో చండీ హోమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు

మంథని,(విజయక్రాంతి): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం(Sri Dattatreya Swamy Temple)లో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన చండీ హోమం(Chandi Homam) కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు(TPCC Secretary Dudilla Sreenu Babu) దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అమ్మవారిని వేడుకున్నారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యం నిండాలని ప్రార్థించారు.

అనంతరం వేద పండితులు దుద్దిళ్ల శ్రీనుబాబుకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలకు సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగల ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు