విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే..

27-11-2026 | 04:58pm

తాంసి/భీంపూర్,నవంబర్ 27(విజయక్రాంతి): భీంపూర్ మండల కేంద్రానికి చెందిన వెట్టి పవన్ ఎమెస్సీ కెమిస్ట్రీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ లో(M.Sc. Chemistry, Central University of Kerala) సీటు సంపాదించారు..

కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను కలిసి విన్నవించగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్  ప్రతిపాదనతో జిల్లా కలెక్టర్ ద్వారా మంజూరు అయిన రూ.50,000 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టపడి చదివి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో భీంపూర్ మాజీ సర్పంచ్ లింబాజి,తదితరులు ఉన్నారు..

మరిన్ని వార్తలు