జెడ్పీ పాఠశాలను సందర్శించిన సర్పంచ్ కుంజా వినోద్

27-11-2026 | 04:59pm

ములకలపల్లి,నవంబర్ 27 (విజయక్రాంతి): జగన్నాధపురం గ్రామంలోని(Jagannadhapuram Village) జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను(Zilla Parishad Government High School) సర్పంచ్ కుంజా వినోద్ శుక్రవారం సందర్శించి విద్యార్థులతో(Students') ఆప్యాయంగా మాట్లాడారు.పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన,మధ్యాహ్న భోజనం,మౌలిక సదుపాయాలు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాదులని ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి ప్రేమతో, బాధ్యతతో చూసుకోవాలని సూచించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి ఆరోగ్యం, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందించే గొప్ప వేదికలుగా నిలవాలని ఆకాంక్షించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది. విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించడం, ప్రభుత్వ పాఠశాలల స్థాయిని పెంచడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసినప్పుడే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయగలమని తెలిపారు.మన గ్రామంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలి.ప్రతి బిడ్డ ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధికి చిరునామాలుగా మారాలి అనే లక్ష్యంతో గ్రామపంచాయతీ తరపున పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో  గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేకుర్తి రామాచారి,వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు