జైనూర్ మండలం దబోలి గ్రామం మహిళలు..
- గిరిజనంతో కళకళలాడిన నాగోబా ఆలయం..
- నాగోబా ఆలయానికి తరలివచ్చిన గుస్సాడీలు.. దండారి బృందాలు..
ఉట్నూర్, నవంబర్04 ( విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో కొలువుదీరిన ఆదివాసుల ఆరాధ్య దేవుడు నాగోబా సన్నిధిలో(shrine of Nagoba, revered deity of the Adivasis) దండారి బృందాలతో కళకళలాడింది. గుస్సాడీ వేషధారణ చేసిన వారితోపాటు గిరిజన గూడాల ఆదివాసి గోండులు తండోపతండాలుగా తరలివచ్చారు.
ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఆదివాసులు బుధవారం ఆలయానికి చేరుకొని నాగోబాకు మొక్కులు తీర్చుకొని గుస్సాడి నృత్యాలు, రేలా రేలా ఆటపాటలు, కోలాటం ఆటలు ఆడుతూ కాలక్షేపం చేశారు. కొమరం భీం జిల్లాలోని జైనూర్, సిర్పూర్ (యు ), లింగాపూర్ మండలాలతోపాటు మంచిర్యాల, నిర్మల్ జిల్లాలతోపాటు అదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల నుండి దండారి బృందాలు కేస్లాపూర్ చేరుకొని నాగోబా మొక్కలు తీర్చుకున్నారు.