గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు..

04-11-2026 | 06:09pm

విజయక్రాంతి" కథనం ఎఫెక్ట్..

ఉట్నూర్, నవంబర్ 04 (విజయక్రాంతి): ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని సిరికొండ మండలంలోని  కన్నాపూర్ తో పాటు పలు గ్రామాల్లో పిట్ట బొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  వైద్య సిబ్బంది గ్రామాల్లో వైద్య శిబిరాలు(Medical Camps) నిర్వహించి జ్వరాల బారిన పడిన వారికి  వైద్యం అందించారు. బుధవారం "విజయక్రాంతి" దినపత్రికలో ప్రచురణ అయిన "గిరిజన గ్రామాల్లో  వైరల్ జ్వరాల విజృంభణ "అనే కథనానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాధన, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అదునపు వైద్యాధికారి డాక్టర్ కుడిమేత మనోహర్ లు స్పందించి మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించి జ్వరాల బారిన పడిన వారితో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి  వైద్యం అందించాలని ఆదేశించారు.

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పిట్ట బొగురం పీహెచ్ సీ వైద్యుడు డాక్టర్ సాయి గణేష్, హెల్త్ సూపర్వైజర్లు జూగ్నక్ అచ్యుతరావు, గంగమ్మలతో పాటు వైద్య సిబ్బంది పాల్గొని జ్వరాలతో బాధపడుతున్న వారికి వైద్యం అందించారు. సర్కారు వైద్యం అందించుట కృషిచేసిన "విజయక్రాంతి" దినపత్రికకు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు