భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం 2 కోట్ల 13 లక్షలు
28-09-2026 | 11:34pm
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి సీతా రామచంద్ర స్వామి(Sri Sita Ramachandraswamy Temple) వారి హుండీ లెక్కింపు అత్యంత భద్రత మధ్య సోమవారం నిర్వహించారు. 98 రోజుల తర్వాత నిర్వహించిన హుండీ లెక్కింపులో రెండు కోట్ల 12 లక్షల 40 వేల 214 రూపాయల ఆదాయం లభించింది. అంతేకాకుండా 170 గ్రాముల బంగారం, కేజీ 400 గ్రాముల వెండి లభించింది. అంతేకాకుండా వివిధ దేశాలకు చెందిన డాలర్లు హుండీ ద్వారా లభించాయి. దేవస్థానం ఈవో దామోదరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.