పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

06-11-2026 | 07:25pm

బిఆర్ఎస్ నాయకులు సోయం వీరభద్రం

దమ్మపేట, నవంబర్ 06(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గ(Ashwaraopet Constituency) వ్యాప్తంగా ఇటీవల సంభవించిన మురసు తుఫాను(Cyclone Murasu) ప్రభావంతో భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం  డిమాండ్ చేశారు.  రైతులు ఎంతో కష్టపడి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు  వరి, మొక్కజోన్న, పత్తి, వేరుశెనగ, మురసు తుఫాన్ కారణంగా పంటలు భారీ మొత్తం లో దెబ్బతినడంతో రైతాంగం తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటుందని అన్నారు.

అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారంలో ఎలాంటి జాప్యం లేకుండా తగిన పరిహారం అందించాలని, చాలా చోట వరదలకు రోడ్లు కొట్టుకుపోవడం ములంగా రాకపోకలు నిలిచిపొయాయని, కొట్టుకుపోయిన రోడ్లను వెంటనే మరమ్మత్తులు చేయాలని ప్రభుత్వాన్ని సోయం వీరభద్రం  డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు