ఘనంగా బుద్ధ ఏకశిలా విగ్రహావిష్కరణ

09-11-2026 | 01:49pm

సర్పంచ్ మల్లుగారి పద్మ -నర్సగౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరణ

గంభీరావుపేట, నవంబర్ 09 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని జై భీమ్ చౌరస్తాలో బుద్ధ దీపావళి పండుగను పురస్కరించుకొని బుద్ధ ఏకశిలా విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ నర్సగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహాన్ని దోసల విజయకుమార్ అందించారు. బుద్ధుడి సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు గొల్ల సుశాంతిక, నిశాంత్ రెడ్డి, మల్ల రాజనర్సు, ఎగదండి అర్జున్, మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు యాదగిరి, జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు బుర్కా గోపాల్, టీఎస్పీటీఏ జిల్లా అధ్యక్షుడు ఉత్తం విజయకుమార్, మాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి బండా చంద్రశేఖర్ రాజు, మండల అధ్యక్షుడు ఎడబోయిన రాజు, మల్యాల రాజ్‌వీర్ రెడ్డి, దోసల ఉపేందర్, టేకుమల్ల బాలయ్య, బిట్ల శివ, శ్రీనివాస్, పే బ్యాక్ టు సొసైటీ మండల అధ్యక్షుడు దోసల శ్రీనివాస్, మాల కుల సంఘాల అధ్యక్షులు తుమ్మల మల్లయ్య, దోసల రామచంద్రం, నల్ల రాజకుమార్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు