డంపింగ్ యార్డ్‌పై రాజకీయం వద్దు: బండి సంజయ్

09-11-2026 | 11:04am

డంపింగ్ యార్డ్ అభివృద్ధి పనులపై రాజకీయాలు చేయడం మానుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) హితవు పలికారు. నేతల రాజకీయాలతో అభివృద్ధి పనులు (Development Works) నిలిచిపోయాయని మండిపడ్డారు. కమీషన్ల కోసం పనులను అడ్డుకోవడం సరికాదని, చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. రాజకీయాల కారణంగా కాంట్రాక్టర్ పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిల్లర వేషాలు పక్కనపెట్టి అభివృద్ధికి సహకరించాలని బండి సంజయ్ సూచించారు. యూసీఎఫ్ (UCF Funds) నుంచి రూ.80 కోట్లు మంజూరు చేయించామని, డంపింగ్ యార్డ్ అభివృద్ధి కోసం మరో రూ.70 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఏడాదిలోగా రోడ్ల నిర్మాణ పనులు (Road Construction) పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించకుండా సహకరించాలని నేతలకు సూచించారు.

మరిన్ని వార్తలు