రేపటి నుంచి కార్తీకమాసం ప్రారంభం
హిందువులకు అత్యంత పవిత్రమైన కార్తీకమాసం (Karthika Masam) రేపటి నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 10 నుంచి మొదలుకానున్న ఈ ఆధ్యాత్మిక మాసంలో భక్తులు ప్రత్యేక పూజలు, దీపారాధనలు, ఉపవాసాలతో (Spiritual Rituals) పరమశివుడిని ఆరాధిస్తారు. ఈ మాసానికి ఎంతో విశిష్టత ఉండటంతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలకు (Temple Rituals) ఏర్పాట్లు చేస్తారు.
కార్తీకమాసంలో నాగుల చవితి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటి ముఖ్యమైన పర్వదినాలు రానున్నాయి. నవంబర్ 13న నాగుల చవితి, నవంబర్ 16న తొలి కార్తీక సోమవారం, నవంబర్ 21న క్షీరాబ్ధి ద్వాదశి, నవంబర్ 23న రెండో కార్తీక సోమవారం జరుపుకోనున్నారు. నవంబర్ 24న కార్తీక పౌర్ణమి (Karthika Pournami) రానుంది. అనంతరం నవంబర్ 30న మూడో కార్తీక సోమవారం, డిసెంబర్ 7న నాలుగో కార్తీక సోమవారం వస్తాయి. డిసెంబర్ 8వ తేదీతో పవిత్ర కార్తీకమాసం ముగియనుంది.