వీధి కుక్కలకు అభయం

09-11-2026 | 12:33pm

మణికొండ,(విజయక్రాంతి): మూగజీవాల ఆకలి తీర్చడమే లక్ష్యంగా పూజ అనే జంతు ప్రేమికురాలు(Animal lover) గత ఆరేళ్లుగా సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో మణికొండలో(Manikonda) ఒక కుక్కకు ఆహారం అందించడంతో ప్రారంభమైన ఈ సేవా ప్రయాణం నేడు ప్రతిరోజూ 72 కుక్కలకు ఆహారం అందించే స్థాయికి చేరుకుంది. కేవలం మణికొండకే పరిమితం కాకుండా, స్కూటీపై ఎక్కడికి వెళ్లినా ఆకలితో కనిపించే మూగజీవాలకు ఆహారం అందిస్తున్నారు.

ఇందుకోసం తన స్కూటీలో ఎప్పుడూ ఆహారాన్ని అందుబాటులో ఉంచుకుంటున్నారు. ఎలాంటి ప్రత్యేక బృందం, స్నేహితుల సహకారం లేకుండానే ఒంటరిగా ఈ సేవను కొనసాగిస్తున్నారు. మూగజీవాల ఆకలి తీర్చేందుకు మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా సహకరించాలని పూజ విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు తోచినంత విరాళం అందించి మూగజీవాల సేవలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు