ప్రకృతి వ్యవసాయ కిట్ల పంపిణీ
ములకలపల్లి,సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకం(Natural Farming Mission Scheme) కింద రైతులకు ప్రకృతి వ్యవసాయంపై స్థానిక రైతు వేదికలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చిన రైతులకు కిట్లను పంపిణీ చేశారు. ములకలపల్లి మండలంలోని మూకమామిడి గ్రామాన్ని ప్రకృతి వ్యవసాయ క్లస్టర్ గా గుర్తించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు తెలిపారు.
ఈ క్లస్టర్ లో 125 మంది రైతులతో 125 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టు తెలియజేశారు. శిక్షణకు హాజరైన 125 మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందించినటువంటి ప్రకృతి వ్యవసాయ కిట్లను మూకమామిడి సర్పంచ్ కోర్స ఆదిలక్ష్మి,తిమ్మంపేట సర్పంచ్ తుర్రం శ్రీను చేతుల మీదగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రాహుల్,సూరిబాబు రైతులు పాల్గొన్నారు.