మిస్ట్ కళాశాలలో ఇంజనీర్స్ డే వేడుకలు
సత్తుపల్లి,సెప్టెంబర్16(విజయక్రాంతి): మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో(Kothur Village) గల మదర్ తెరిసా ఇంజనీరింగ్ అటానమస్ కళాశాలలో(Mother Teresa Engineering Autonomous College) సర్ డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 166 వ జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే(Engineers Day Celebration) వేడుకలను కళాశాల ప్రిన్సిపల్ చలసాని హరికృష్ణ ఆధ్వర్యంలో వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల అధినేత చలసాని సాంబశివరావు హాజరై ,ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మన దేశానికి నిర్మాణ రంగంలో అందించిన సేవలను కొనియాడారు.
భారతదేశంలో నేడు ప్రముఖ బహుళార్థ సాగర్ ప్రాజెక్ట్ ఒకటైనదిగా దానిపేరే నాగార్జునసాగర్ డ్యాం గా పిలుస్తున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టును రూపకల్పన చేయటం ద్వారా భారతదేశ భారతరత్న బిరుదు అంకితం చేసింది. భారతదేశానికే కాకుండా అనేక దేశాలు ప్రజలు ఆయన సేవలను వినియోగించుకున్నారని అన్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా కళాశాలలో అభిరుచి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రాజెక్ట్ ఎక్స్పో, పోస్టర్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు తరగతి బోధనతో పాటు, ఆధునిక సాంకేతికతను అభివృద్ధి పరుచుకోవాలని అదే విధంగా సమాచార సాంకేతికత, అనేది వెన్నుముక లాంటిదని అన్నారు. సవాళ్లను అధిగమిస్తూ ఐటీని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే మానవ జీవితం మరింత సుఖమయం అవుతుందని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి ఉదయ్ కిరణ్ భార్గవ్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.వి రామచంద్రారావు, సివిల్ విభాగాధిపతి కే రామకృష్ణ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు.