రూపాయి పతనం.. ఎంతంటే?

16-09-2026 | 10:30am

ముంబై: అమెరికన్ కరెన్సీ(American currency) బలపడటం, విదేశీ నిధుల తరలింపు కారణంగా బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికన్ డాలర్‌తో(American dollar) పోలిస్తే రూపాయి విలువ(Rupee Value) 3 పైసలు తగ్గి 95.91కి చేరింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ముడి చమురు ధరలు అధికంగానే ఉన్నప్పటికీ, సానుకూల దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్థానిక కరెన్సీకి మద్దతునిచ్చాయని ఫారెక్స్ వ్యాపారులు(Forex Traders) తెలిపారు. అంతర్‌బ్యాంక్ విదేశీ మారకపు మార్కెట్‌లో, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 95.89 వద్ద ప్రారంభమై, ఆ తర్వాత 95.91 స్థాయికి పడిపోయింది. తద్వారా ఇది తన మునుపటి ముగింపు స్థాయి కంటే 3 పైసల తక్కువ వద్ద ట్రేడవుతోంది.

ట్రేడింగ్‌లో కోలుకున్న మార్కెట్లు

గత సెషన్‌లో తీవ్రంగా పడిపోయిన మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో వాల్యూ బయింగ్ కారణంగా పుంజుకున్నాయి. అయితే, చమురు ధరల పెరుగుదల, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానపరమైన నిర్ణయానికి ముందు నెలకొన్న అప్రమత్తత, విదేశీ నిధుల తరలింపు వంటి అంశాలు మార్కెట్ల ర్యాలీని పరిమితం చేశాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో 30 షేర్ల BSE సెన్సెక్స్ 244.02 పాయింట్లు పెరిగి 74,293.25కు చేరింది. 50 షేర్ల NSE నిఫ్టీ 77.20 పాయింట్లు పెరిగి 23,201.85 వద్ద నమోదైంది.


మరిన్ని వార్తలు