మూడు ప్యాకెట్లలో గంజాయి లభ్యం

16-10-2026 | 07:32pm

దమ్మపేట, అక్టోబర్ 16(విజయక్రాంతి): మండల పరిధిలోని అంకంపాలెం గ్రామ పంచాయతీ(Village Panchayat), కొడిశెలగూడెం గ్రామానికి చెందిన పెనుబల్లి నాగులు అనే రైతు నాటు తుపాకీతో అడవుల్లో జంతువుల వేటకు(Hunting of animals) వెళ్తున్నట్లు అటవీశాఖకు(Forest Department) పక్కా సమాచారం అందింది. దీంతో ఎఫ్ఎస్ఓ భద్రయ్య(FSO Bhadraiah) తన సిబ్బందితో కలిసి శుక్రవారం మధ్యాహ్నం సమయంలో నాగులు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో ఏకంగా గంజాయి(Cannabis), మందుగుండు సామగ్రి బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

నాటు తుపాకీ కోసం గాలింపు చేస్తుండగా, ప్యాక్ చేసి ఉన్న రెండు ప్యాకెట్లు అధికారులకు అనుమానాస్పదంగా కనిపించాయి. వాటి గురించి ఇంట్లో ఉన్న నాగులు భార్యను ఆరా తీయగా ఆమె సరైన సమాధానం చెప్పలేదు. అనుమానం వచ్చిన అధికారులు ఒక ప్యాకెట్ను విప్పి పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే అప్రమత్తమై ఇంట్లో క్షుణ్ణంగా శోధించగా మరో ప్యాకెట్ బయటపడింది. లభ్యమైన మొత్తం మూడు ప్యాకెట్లలో సుమారు 5 కిలోల గంజాయి ఉంటుందని సమాచారం.

ఈ తనిఖీల్లో నాటు తుపాకీ నేరుగా లభించనప్పటికీ, అందులో ఉపయోగించే భారీ సామగ్రిని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వేటకు ఉపయోగించే 52 చిన్న చర్రాలు, 28 పెద్ద ఇనుప చర్రాలు, ఒక గన్పౌడర్ సీసా, టపాసుల మందు డబ్బా, వేటకు వాడే ప్రత్యేక హారన్, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఈ విషయాన్ని ఎఫ్ఎస్ఓ భద్రయ్య ఉన్నతాధికారి అయిన రేంజర్ శ్రీను దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రేంజర్ శ్రీను స్థానిక ఎస్ ఐ రాజేష్ కుమార్ కు సమాచారం అందించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, సామగ్రిని అటవీశాఖ కార్యాలయానికి తరలించి అధికారులు పంచనామా నిర్వహించి, అనంతరం తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం కేసును స్థానిక పోలీసులకు అప్పగించనున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు