విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చండీ హోమం

15-10-2026 | 10:31pm

శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి దేవిగా దర్శనం

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ స్వర్ణ దుర్గ అమ్మవారి శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం మంగళ వాద్యములు, తీర్థపు బిందె, నిత్యార్చన జరుపబడినది. అమ్మవారి పంచామృత స్నపనము, పీఠార్చన, అనుస్టానం, అమ్మవారికి విశేష హోమము, చండీ హోమం ఉదయo ఆలయంలో జరుపబడ్డాయి.

ఉదయం 10:00 గంటల నుంచి కుంకుమార్చన, శ్రీ చక్ర నవావరణార్చన, మహాలక్ష్మి, దుర్గా, చండీ సప్తశతీ పారాయణ, అనుష్టానములు పీఠ పూజ నిర్వహించబడింది. రాత్రి 8 గంటలకు అమ్మవారు  శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరీ దేవి అలంకరణలో భక్తులకీ దర్శనమిచ్చారు.

ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతీ జీవీకి అమ్మగా ఆర్తులను రక్షించు అన్నపూర్ణగా సకల ప్రాణులకు, ప్రాణాధారమైన ఆహారమును అందించే తల్లిని దర్శిస్తే ఈతి భాధలు తీరి అన్న వస్త్రములకు లోటు లేకుండా ఉండెదరు. అనంతరం రాత్రి 10 గంటలకు మహా హారతి, ఆలయ బధనము.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

మరిన్ని వార్తలు