నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి
హనుమకొండ,(విజయక్రాంతి): నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల(NHM Employees) సమస్యను పరిష్కరించాలని జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డిపిఓ రుక్ముద్దీన్(JAC State General Secretary DPO Rukmuddin), కోశాధికారి నరేష్ డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 17,000 మంది NHM ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనే డిమాండ్ తో అనుమకొండ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రుక్ముద్దీన్, నరేష్ లు మాట్లాడుతూ... రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలనీ, ఉద్యోగ భద్రత,ఆరోగ్య భద్రత కల్పించి,180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.3 వ రోజు ఎన్ హెచ్ ఎం ఉద్యోగస్తులు చేపట్టిన నిరవదిక సమ్మెకు మద్దతుగా తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ బిక్షపతి సంఘీభావం ప్రకటించారు.
అనంతరం మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవే , తప్పకుండా రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత తో చర్చించి వారి యొక్క న్యాయమైన డిమాండ్లకు రక్షణ సేన పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమ్మెలో వరంగల్ ఈస్ట్ ఇంచార్జ్ వెలిగేటి రవికుమార్, పర్వపల్లి శ్రీశైలం, సంతోష్ కుమార్ సంఘీభావం ప్రకటించిన వారిలో ఉన్నారు.ఈ నిరవధిక సమ్మె లో తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్, ఇతర ఫార్మసీ ఆఫీసర్లు,జిల్లా ప్రెసిడెంట్ నవీన్ కుమార్, సురేందర్, వినోద, కళ్యాణి, ఇతర ఎన్ హెచ్ ఎం ఉద్యోగస్తులు పాల్గొన్నారు.