మీడియా అక్రిడిటేషన్ కార్డుల గడువు నవంబర్ 25 వరకు పొడిగింపు
టియూడబ్ల్యూ జే ఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాకూబ్ పాషా
పాల్వంచ,(విజయక్రాంతి): తెలంగాణలో 2022లో జారీ చేసిన మీడియా అక్రిడిటేషన్(Media Accreditation) కార్డుల చెల్లుబాటు గడువును నవంబర్ 25, 2026 వరకు పొడిగిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(Telangana Urdu Working Journalists Federation) జిల్లా అధ్యక్షుడు యండీ. యాకూబ్ పాషా ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు–2025ను సవాలు చేస్తూ టీయుడబ్ల్యుజేఎఫ్(TUWJF) తదితర జర్నలిస్టు సంఘాలు హైకోర్టు(High Court)లో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుందని, కొత్త నిబంధనలపై ప్రధాన పిటిషన్ల తుది విచారణను నవంబర్ 25న చేపట్టనున్నట్లు హైకోర్టు వెల్లడించిందని యాకూబ్ పాషా తెలిపారు.