లలిత త్రిపుర సుందరి దేవి దివ్య దర్శనం ఇచ్చిన అమ్మవారు

15-10-2026 | 11:07pm

వెంకటాపురం నూగూరు,(విజయక్రాంతి): వెంకటాపురం మండల(Venkatapuram mandal) కేంద్రంలోని రజక బజారులో వేంచేసియున్న దుర్గామాత కమిటీఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో(Sri Devi Sharannavaratri Utsavalu) భాగంగా ఐదవ రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి(Lalita Tripura Sundari Devi) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. పూజా కార్యక్రమాలతో మండపం ప్రాంగణం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా అమ్మవారికి కూసం సాంబశివరావు సత్యవతి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. చిన్న మూర్తి అర్చకులు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు తనంతరం తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు. 

మరిన్ని వార్తలు