పార్టీకి బలం కార్యకర్తలే
బీబీపేట,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district) బీబీపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల, కార్యకర్తల కుటుంబాలను గురువారం కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్(Former MLA Gampa Govardhan) పరామర్శించారు. మాజీ మండల కార్యదర్శి దేవునిపల్లి శ్రీనివాస్ గత కొన్ని నెలల క్రితం మరణించగా ఆయన తండ్రి ఇటీవల మరణించారు. వార్డు మెంబర్ కుర్ల దేవరాజు తల్లి ఇటీవల మరణించగా రెండు కుటుంబాలను పరామర్శించారు. ఇమ్మడి చంద్రం సీనియర్ నాయకులు ఇటీవల కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతూ ఆపరేషన్ చేయించుకున్నారు.
ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమని వారి మంచి చెడ్డలు తప్పకుండా చూడవలసిన బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, మాజీ మండల అధ్యక్షురాలు పశులాది బాలమని, పట్టణ అధ్యక్షులు ఎనుగండ్ల రవి, అరికెల నందకుమార్, మాజీ ఎంపీటీసీ పంపరి శివరాజ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆది రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.