జర్నలిస్టుల ఆరోగ్యానికి శుభం ఆసుపత్రి భరోసా

15-10-2026 | 10:53pm

ఆసుపత్రి హెల్త్ కార్డుల పంపిణీ

కుటుంబ సభ్యులకూ రాయితీపై వైద్యం

నారాయణఖేడ్: జర్నలిస్టుల ఆరోగ్య సంక్షేమానికి(Health and Welfare of Journalists) నారాయణఖేడ్ పట్టణంలోని శుభం ఆసుపత్రి(Shubham Hospital) యాజమాన్యం ముందుకొచ్చింది. గురువారం ఆసుపత్రి యజమానులు అబ్దుల్ రౌఫ్, శేఖర్ సౌజన్యంతో టీయూడబ్ల్యూజే–ఐజేయూ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు(Health cards) అందజేశారు. జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు రాయితీపై వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.

ఆసుపత్రిలో క్లినికల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేష్, ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ సందీప్ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, రాహుఫ్, హసీబ్ పాటిల్, నియోజకవర్గ అధ్యక్షుడు జి.సత్యం, భూమయ్య, అశోక్, నిసార్, రషీద్, జైపాల్ రెడ్డి, అంబదాస్, నాథేక్, రవీందర్, రాములు, లయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు