బాలికలకు స్నేహ సంఘాలు ఏర్పాటు

15-10-2026 | 11:14pm

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

హన్వాడ: మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar district) హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామంలో సర్పంచ్ గుముడాల దీప్తిరఘురాం గౌడ్ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు స్నేహ సంఘాల ఏర్పాటు, డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల(Digital smart ration cards) పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ‘మన టాలెంట్ – మన సందడి’ కార్యక్రమంలో(Mana Talent – ​​Mana Sandadi Program) భాగంగా బాలికలకు క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అదనపు డీఆర్‌డీఓ రేణుక దేవి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, వారి ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయని అన్నారు. ప్రతి బాలిక స్నేహ సంఘాల్లో చేరి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ దీప్తిరఘురాం గౌడ్ సూచించారు.

అనంతరం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సర్పంచ్ తెలిపారు. ఇంకా కార్డులు అందని అర్హులు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో జీపీఓ నవ్య, ఐబీ ఏపీఎం ప్రవీణ, మండల సమాఖ్య ఏపీఎం భాగ్యలక్ష్మి, క్లస్టర్ సీసీ జయమ్మ, గ్రామ సంఘాల సభ్యులు, రేషన్ డీలర్లు, ప్రజాప్రతినిధులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు