గ్రాట్యుటీ ఉత్తర్వుల జారీపై ఉద్యోగుల హర్షం
భూపాలపల్లి,(విజయ క్రాంతి): వీబీజీఆర్ఎంజీ పథకం(VBGRMG scheme) కింద పనిచేస్తున్న ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి సీతక్క(Minister Seethakka), అధికారులు, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు తదితరులకు సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఐడీఓసీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జాక్ చైర్మన్ ఎస్.కే. జమీర్ పాషా మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా ఎన్నో విజ్ఞప్తులు, పోరాటాల అనంతరం గ్రాట్యుటీపై ప్రభుత్వ ఉత్తర్వులు రావడం సంతోషకరమన్నారు. సిబ్బంది చిరకాల వాంఛ అయిన వేతన శ్రేణిని కూడా మంత్రి సీతక్క త్వరగా అమలు చేయాలని కోరారు.
ఉద్యోగులకు సహకరిస్తున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ మంజులదేవి, ఎం.కుమార్ స్వామి, రాజు, రేణుక, శ్రావణ్కుమార్, మధుకర్, ప్రకాష్, మూర్తి, రామ్చందర్, మురళి, దివ్య, సునీత, రమేష్, వెంకన్న, దుబాసి విఠల్, నాగేందర్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.