చిగురుమామిడి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ

15-10-2026 | 11:30pm

చిగురుమామిడి,(విజయక్రాంతి): చిగురుమామిడి పోలీస్ స్టేషన్(Chigurumamidi Police Station)ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని జనరల్ డైరీ, ఎఫ్ఐఆర్ కాపీలు, పెండింగ్ కేసులు, రౌడీ షీటర్ల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణ, రిసెప్షన్ కౌంటర్, లాకప్ రూమ్లను పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం(CP Ghouse Alam) మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితుల సమస్యలను శ్రద్ధగా విని వారికి త్వరితగతిన న్యాయం చేకూర్చాలని సిబ్బందిని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణ(Maintenance of law and order)లో ఎలాంటి అలసత్వం వహించరాదని, గ్రామాల్లో నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సీఐ అనిల్, చిగురుమామిడి ఎస్సై జగదీశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు