ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించాలి

11-11-2026 | 06:53pm

బూర్గంపాడు,(విజయక్రాంతి): ఉపాధిహామీ (వీబీజీ-రామ్) పథకంలో(Employment Guarantee (VBG-RAM) Scheme) భాగంగా ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకోవాలని పినపాక పట్టినగర్‌ సర్పంచ్‌ బానోత్‌ పద్మ సూచించారు. బుధవారం పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరితో కలిసి గ్రామపంచాయతీ పరిధిలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ప్రారంభించారు.

వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని తెలిపారు. ప్రతి కుటుంబం ఇంకుడు గుంత నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీను,గుమస్తా పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు