వచ్చే ఏడాది నుంచే మార్పులు

11-11-2026 | 05:02pm

హైదరాబాద్: రాష్ట్ర విద్యావ్యవస్థలో కీలక మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే 10+2 విద్యావిధానాన్ని(10+2 Education System) అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిర్ణయించినట్లు వెల్లడించారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల(Education Department Officials)తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో విద్యారంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై ఆయన దిశానిర్దేశం చేశారు.

మారుతున్న కాలానికి, ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యావిధానాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు(Students) కేవలం పాఠ్యపుస్తకాల పరిజ్ఞానమే కాకుండా, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా నైపుణ్యాలను కూడా అందించాలని స్పష్టం చేశారు.

ప్రత్యేకంగా 12వ తరగతి నుంచి నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ప్రత్యేక విద్యా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు తెలిపారు. నాణ్యమైన విద్యను అందించడం, విద్యార్థులను పోటీ ప్రపంచానికి సిద్ధం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యారంగంలో ప్రతిపాదిత మార్పుల అమలుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు