బీహార్ గవర్నర్‌తో మీర్ ఫిరాసత్ అలీ బక్రీ భేటీ

11-11-2026 | 04:44pm

హైదరాబాద్: బీహార్ రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్(Bihar Governor Lt. Gen. Syed Ata Hasnain) హైదరాబాద్ పర్యటన సందర్భంగా మీర్ ఫిరాసత్ అలీ బక్రీ(Meer Firasath Ali Bakri) మర్యాదపూర్వకంగా కలిశారు. పాట్నాలోని చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ (Chanakya National Law University) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఫైజాన్ ముస్తఫాతో కలిసి గవర్నర్‌కు స్వాగతం పలికి, ఆత్మీయంగా సంభాషించారు.

ఈ సందర్భంగా గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్‌ను కలవడం, ఆయనతో మాట్లాడటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని మీర్ ఫిరాసత్ అలీ బక్రీ పేర్కొన్నారు. ఈ భేటీ తనకు ప్రత్యేక అనుభూతినిచ్చిందని తెలిపారు. మీర్ ఫిరాసత్ అలీ బక్రీ గతంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు