ఎస్బిఐ ఏటీఎంలో చోరీకి యత్నం
సైరన్ మోగడంతో పరారైన దుండగుడు
కొనసాగుతున్న పోలీసుల విచారణ
కామారెడ్డి, నవంబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజు వద్ద గల ఎస్బిఐ ఏటీఎం(SBI ATM)లో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నించాడు. ఏటీఎం ఎస్బిఐ బ్యాంక్ అమర్చిన అలారం మోగడంతో దొంగలు పరారయ్యారు. ఏటీఎం వద్దగల సిసి ఫుటేజ్ లో మాత్రం ఒక్కరే రికార్డు అయ్యారు. ఏటీఎంలో చోరీ చేసేందుకు విపల యత్నం చేసి పరారయ్యాడు.
కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పక్కన ఉన్న ఏటీఎంలను పరిశీలిస్తున్నారు. ఏటీఎం చోరీకి ఒక్కరే వచ్చారా మరికొందరు కలిసి వచ్చారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు పట్టణ సీఐ నరహరి తెలిపారు.