ఆరుతడి పంటలపై రైతులు ఆసక్తి పెంపొందించుకోవాలి
మండల వ్యవసాయ అధికారి బన్న రజిత పిలుపు
నల్లబెల్లి, నవంబర్ 11 ( విజయ క్రాంతి ): వాతావరణ(Weather) పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఆరుతడి పంటల సాగుపై(Farmers cultivate wet crops) ఆసక్తి పెంపొందించుకోవాలని మండల వ్యవసాయ అధికారి బన్న రజిత(Agricultural Officer Banna Rajitha) సూచించారు. బుధవారం మండలంలోని రాంపూర్ గ్రామంలో 'ఖేతి బచావో' కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఓ రజిత మాట్లాడుతూ. ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా నమోదైందని, భూగర్భజలాలు అడుగంటుతున్నందున యాసంగిలో అధిక నీటిని తీసుకునే వరి సాగుకు రైతులు దూరంగా ఉండాలన్నారు.
వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో, స్వల్పకాలిక పంటలైన పెసర, బొబ్బర్లు, శనగ, చిరుధాన్యాలు (జొన్న, రాగులు, కొర్రలు), జనుము, వేరుశనగ (పల్లికాయ), నువ్వులు, కుసుమలు, ప్రొద్దుతిరుగుడు, కూరగాయల సాగు చేపట్టాలని కోరారు. నేలసారాన్ని కాపాడుకునేందుకు రసాయన ఎరువులను తగ్గించి జీవామృతం, ఘనజీవామృతం, నీమాస్త్రం వంటి సేంద్రియ ఎరువులను వినియోగించాలని పేర్కొన్నారు.
అనంతరం పశుసంవర్ధక శాఖ వెటర్నరీ అధికారి సురేష్ మాట్లాడుతూ.ఎన్ఎల్ఎం వీబీగ్రామ్ పథకాల ద్వారా పశుగ్రాసం సాగు చేసే రైతులకు మూడేళ్ల పాటు ఎకరాకు విడతల వారీగా ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భారతమ్మ, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) రాకేష్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.