భూముల రీసర్వేపై రైతులు అవగాహన పెంచుకోవాలి

11-11-2026 | 06:45pm

వరి సాగుకు బదులుగా ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

గంభీరావుపేట, నవంబర్ 11 (విజయక్రాంతి): భూముల రీసర్వే ప్రక్రియపై రైతులు పూర్తి అవగాహన పెంచుకోవాలని, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించే అధికారులకు సహకరించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్(Additional Collector Nagesh) సూచించారు. బుధవారం గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూముల రీసర్వేలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఖచ్చితమైన వివరాలు సేకరించాలని సర్వే బృందాన్ని ఆదేశించారు.

రైతులకు ముందస్తుగా అవగాహన కల్పిస్తూ, వారి సమక్షంలో పారదర్శకంగా సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. మరోవైపు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు, వ్యవసాయ అధికారుల సూచనలను రైతులు పాటించాలని కోరారు. వరి సాగుకు బదులుగా ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో ఆయిల్‌పామ్, కూరగాయల సాగుతో లాభాలు పొందుతున్న రైతుల అనుభవాలను తెలుసుకొని ఇతర రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మారుతి రెడ్డి, సర్వేయర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు