చర్లలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం

23-11-2026 | 11:05pm

ప్రారంభికులు: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

చర్ల (విజయక్రాంతి): జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ - ఎస్ జి ఎఫ్ ఐ, చర్ల పోలీస్ ఆధ్వర్యంలో అండర్-17 బాలుర రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్(Volleyball Tournament) చర్ల పోలీస్ స్పోర్ట్స్ గ్రౌండ్‌లో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 23 నుండి 25 వరకు ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు జరగనున్నాయి. 10 ఉమ్మడి జిల్లాల నుండి 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని టోర్నమెంట్‌ను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్రీడలు యువతలో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. ఒకప్పుడు ఉద్రిక్త వాతావరణం ఉండే చర్లలో ఇప్పుడు క్రీడా సందడి నెలకొనడం హర్షణీయమన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని, మైదానాన్ని అభివృద్ధి చేసిన సీఐ రాజు వర్మను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శంభు ప్రసాద్, ఎస్ జి ఎఫ్ ఐ  సెక్రటరీ బావు సింగ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కె. ఈదయ్య, సీఐ ఎ. రాజు వర్మ, ఎంఈఓ పరిటాల వెంకట రమణ, ఎస్ఐ ఆర్. నర్సిరెడ్డి, సర్పంచ్ పూజారి సామ్రాజ్యం, నాయకులు, అధికారులు, పీఈటీలు, కోచ్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు