నలుగురు ప్రొబేషనరీ డీఎస్పీల కేటాయింపు

23-11-2026 | 10:58pm

సీపీని కలిసిన శిక్షణ డీఎస్పీలు

ఖమ్మం టౌన్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా నలుగురు ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ)లను ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌(Khammam Police Commissionerate)కు కేటాయించారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

ఈ మేరకు సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ను కలిసి రిపోర్ట్ చేసిన సపావత్ దశరథ్, బోయినపల్లి ప్రణయ్ సాయి, వంగా అక్షయ్ కుమార్ రెడ్డి, అఖిలజా రెడ్డి అఖెల్లి అనే నలుగురు ప్రొబేషనరీ డీఎస్పీలు నవంబర్ 23 నుంచి ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్దేశిత శిక్షణ కార్యక్రమం ప్రకారం జిల్లా స్థాయి ప్రాక్టికల్ శిక్షణ పొందనున్నారు. ఈ శిక్షణలో భాగంగా పోలీస్ శాఖ పనితీరు, క్షేత్రస్థాయి విధులు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ తదితర అంశాలపై అనుభవాన్ని పొందనున్నారు.

మరిన్ని వార్తలు