సమస్యలపై మంత్రిని కలిసిన జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ చైర్మన్
బెజ్జూర్ నవంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy)ని హైదరాబాద్లో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ చైర్మన్ అర్షద్ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో రహదారులు అధ్వాన్నంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, పాడైన రోడ్ల మరమ్మతులు చేపట్టి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు.విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు, అత్యవసర వైద్య సేవలు పొందలేక రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, జిల్లా వ్యాప్తంగా రహదారుల సమస్యలను పరిష్కరించి అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. వారు సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.