ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

20-11-2026 | 04:08pm

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా

చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండలంలోని సూర్యనాయక్ తండా గ్రామ పంచాయతీ(Suryanayak Thanda Gram Panchayat)లో ప్రారంభమైన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Life Insurance Scheme) నమోదు శిబిరాన్ని జిల్లా అదనపు కలెక్టర్ భూక్యా హరిసింగ్(Additional Collector Bhukya Hari Singh) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఈ పథకాన్ని అర్హులైన కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కుటుంబాన్ని పోషించే 18 నుంచి 59 ఏళ్ల వయసు గల సభ్యుడిని బీమా పొందే వ్యక్తిగా ప్రతిపాదిస్తారని తెలిపారు. సూర్యనాయక్ తండా గ్రామ పంచాయతీలో 146 రేషన్ కార్డులు ఉన్నాయని, ప్రతి కుటుంబం పథకంలో నమోదు చేసుకోవాలని కోరారు. కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసే సమయంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు