లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత దినోత్సవం

20-11-2026 | 04:10pm

ముకరంపుర,(విజయక్రాంతి) లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో గురువారం వావిలాలపల్లిలోని గౌరిశెట్టి వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు జాతీయ ఐక్యత, మత సామరస్యం, సోదరభావం ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే సందేశంతో బి.ఎడ్. విద్యార్థులకు పునర్వినియోగ వస్త్ర సంచులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మ్యాడం శివకాంత్,  బట్టు వినోద్, మెతుకు కె. చైతన్య,  సింగమ రాజు,  ఐత సూరజ్, కోల అన్నారెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు