బర్డ్ ఫ్లూకు చెక్.. భారత్ సరికొత్త టీకా

20-11-2026 | 04:05pm

బర్డ్ ఫ్లూ (Bird Flu) నివారణ దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. ఈ వ్యాధిని నియంత్రించేందుకు దేశంలోనే తొలిసారిగా స్వదేశీ హెచ్5ఎన్1 వ్యాక్సిన్‌ (H5N1 Vaccine)ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్‌ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు.

భోపాల్‌లోని ఐసీఏఆర్‌-నిషాద్ (ICAR-NIHSAD) శాస్త్రవేత్తలు ఈ టీకాను రూపొందించారు. దేశీయంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం పశుసంవర్ధక, పౌల్ట్రీ రంగాలకు కీలక పరిణామంగా భావిస్తున్నారు. విదేశీ టీకాలపై ఆధారపడకుండా స్వదేశీ పరిశోధనలతో వ్యాక్సిన్ తయారు చేయడం విశేషం.

బర్డ్ ఫ్లూ కారణంగా పక్షులు, కోళ్లలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు పౌల్ట్రీ రంగానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో స్వదేశీ వ్యాక్సిన్ (Indigenous Vaccine) అందుబాటులోకి రావడం వ్యాధి నియంత్రణ ప్రయత్నాలకు కొత్త ఊతమివ్వనుంది.

భారత శాస్త్రవేత్తల పరిశోధనలకు ఇది కీలక విజయంగా నిలిచింది. అయితే వ్యాక్సిన్ వినియోగం, అమలు విధానం, అందుబాటుపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు