భూ సమస్యలకు చెక్ పెట్టేలా సమగ్ర భూ సర్వే

20-11-2026 | 04:04pm

సర్వాయిపేటలో సర్పంచ్ రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

కోటపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) కోటపల్లి మండలంలోని సర్వాయిపేట గ్రామంలో సమగ్ర భూ సర్వేపై గ్రామ సర్పంచ్ గుగ్లోత్ రాజేష్ నాయక్(Village Sarpanch Gugloth Rajesh Nayak) ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. భూముల హద్దుల నిర్ధారణ, రికార్డుల నమోదు, సర్వే ప్రక్రియ, రైతులకు కలిగే ప్రయోజనాలపై అధికారులు ప్రజలకు వివరించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ప్రతి ఒక్కరూ సర్వేకు సహకరించాలని సూచించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ... ప్రతి రైతుకు తన భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించడంలో సమగ్ర భూ సర్వే కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల తాసిల్దార్ రాఘవేంద్రరావు, డిప్యూటీ తాసిల్దార్ కొండయ్య, గిర్దవారి  మురళీకృష్ణ ,గ్రామపంచాయతీ అధికారిని మల్లక్క , పంచాయతీ కార్యదర్శి రాజు, ఉప సర్పంచ్ రవీందర్ ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు