పురుషుల్లో నిశ్శబ్ద ముప్పు.. ప్రోస్టేట్ క్యాన్సర్

11-09-2026 | 05:05am
  1.    50 ఏళ్లు దాటిన వారు అప్రమత్తంగా ఉండాలి
  2. కేర్ హాస్పిటల్స్ వైద్యులు
  3. ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన మాసం  

హైదరాబాద్, సెప్టెంబరు 10(విజయక్రాంతి): పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్(Prostate cancer) ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణా లు లేకుండానే పెరిగే అవకాశం ఉందని కేర్ హాస్పిటల్స్(CARE Hospitals) వైద్యులు(Doctors) హెచ్చరించారు. ముఖ్య ంగా 50 ఏళ్లు దాటిన పురుషులు తమ వ యసు, కుటుంబ చరిత్ర, వ్యక్తిగత ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రోస్టేట్ ఆరోగ్యంపై వై ద్యులను సంప్రదించాలని సూచించారు. మూత్ర సంబంధిత సమస్యలు వచ్చిన తర్వా తే పరీక్షలు చేయించుకోవాలనే భావన సరికాదన్నారు.

సెప్టెంబరు ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని వైద్యులు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌నేషనల్(Indian Council of Medical Research) క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ అంచనాల ప్రకారం దేశంలో ప్రో స్టేట్ క్యాన్సర్ కేసులు 2020లో 41,532 ఉండగా, 2025 నాటికి 47,068కు పెరుగుతాయని అంచనా వేశారు. అంటే ఐదేళ్లలో 13 శాతానికి పైగా పెరుగుదల.

వయసు పెరి గే కొద్దీ ఈ క్యాన్సర్ ముప్పు కూడా పెరుగుతుందన్నారు. కేర్ హాస్పిటల్స్, క్లినికల్ డైరెక్ట ర్, సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్‌యూరాలజీ, రోబోటిక్, లాపరోస్కోపీ అండ్ ఎం డోయూరాలజీ సర్జన్ డాక్టర్ పి. వంశీకృష్ణ(P Vamsikrishna) మాట్లాడుతూ ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తే తప్పనిసరిగా మూత్ర సంబంధిత లక్షణాలు కనిపి స్తాయనేది అపోహ. ప్రారంభ దశలో ఎలాం టి లక్షణాలు లేకపోవచ్చు. ముఖ్యంగా 50 ఏళ్ల తర్వాత ముప్పు పెరుగుతుంది. కుటుంబంలో ఈ క్యాన్సర్ చరిత్ర ఉంటే ప్రమాదం మరింత ఎక్కువ కావచ్చు.

సమస్యలు తీవ్రమయ్యే వరకు ఎదురుచూడకుండా వైద్యుడి తో ప్రోస్టేట్ ఆరోగ్యం గురించి మాట్లాడాలి. వయసు, కుటుంబ చరిత్ర, లక్షణాలు, వ్యక్తిగత ముప్పును పరిశీలించి తదుపరి పరీక్షలు అవసరమా లేదా వైద్యుడు నిర్ణయిస్తారు అని తెలిపారు. కేర్ హాస్పిటల్స్లోని కేర్ క్యాన్స ర్ ఇన్స్టిట్యూట్కు చెందిన సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మరియు రోబోటిక్ సర్జన్ డాక్ట ర్ అజయ్ చాణక్య వల్లభనేని మాట్లాడు తూ.. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రతి రోగిలో ఒకే విధ ంగా ఉండదు.కొన్ని క్యాన్సర్లు నెమ్మదిగా పె రుగుతాయి.

ఎంపిక చేసిన రోగుల్లో వెంట నే చికిత్స ప్రారంభించకుండా వైద్యుల పర్యవేక్షణలో ‘యాక్టివ్ సర్వైలెన్స్’ విధానాన్ని అ నుసరించవచ్చు. మరికొందరిలో వ్యాధి స్వ భావాన్ని బట్టి శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ లేదా ఇతర చికిత్సలు అవస రం కావచ్చు. క్యాన్సర్ ఇతర భాగాలకు వ్యా పించకముందే గుర్తిస్తే చికిత్సకు మరిన్ని అవకాశాలు ఉంటాయి.

సరైన సమయంలో క చ్చితమైన నిర్ధారణ చేసి, క్యాన్సర్ స్వభా వం, రోగి పరిస్థితికి అనుగుణంగా చికిత్స అందించడమే ముఖ్యం అని వివరించారు. ‘ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభంలో హెచ్చరిక ఇవ్వకపోవ చ్చు. ముప్పును తెలుసుకోండి.. మార్పులను నిర్లక్ష్యం చేయొద్దు.. లక్షణాలు వచ్చే వరకు ఎదురుచూడకుండా వైద్యుడిని సంప్రదించండి’ అని కేర్ హాస్పిటల్స్ సూచించింది. 

మరిన్ని వార్తలు