ఆర్థిక వృద్ధిలో భారత్ టాప్ గేర్
భారత్ గ్రోత్‌పై భారీ అంచనా.. 2027లో ఏకంగా 7 శాతం!
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థకు ఒకవైపు వృద్ధి సంకేతాలు కనిపిస్తుండగా.. మరోవైపు పెరుగుతున్న ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశ వాస్తవ GDP Growth సుమారు 7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని Brickwork Ratings (BWR) తాజా నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వ పెట్టుబడులు, దేశీయ వినియోగం, Services రంగంలో కొనసాగుతున్న బలమైన కార్యకలాపాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా పేర్కొంది. అయితే Inflation ఒత్తిళ్లు తగ్గకపోవడంతో Reserve Bank of India (RBI) వడ్డీ రేట్ల విషయంలో కఠిన వైఖరిని కొనసాగించవచ్చని నివేదిక తెలిపింది. డిసెంబర్ 2026లో మరో 25 Basis Points మేర Repo Rate పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది. అదే జరిగితే ప్రస్తుతం ఉన్న 5.50 శాతం నుంచి వడ్డీ రేటు 5.75 శాతానికి చేరుతుంది. ఆ తర్వాత కొంతకాలం వడ్డీ రేట్లలో మార్పులు లేకుండా RBI Pause తీసుకోవచ్చని BWR అభిప్రాయపడింది.
ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్న రంగాలు
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ప్రభుత్వం Capital Expenditure కింద రూ.6.55 లక్షల కోట్లను ఖర్చు చేసింది. Infrastructure అభివృద్ధికి ఈ పెట్టుబడులు ఊతమిస్తున్నాయి. మరోవైపు అక్టోబర్‌లో Services PMI 55.8కు, Composite PMI 56.2కు చేరడం సేవల రంగంలో బలమైన కార్యకలాపాలను సూచిస్తోంది. సెప్టెంబర్‌లో Industrial Production 6.7 శాతం పెరగగా, Manufacturing Output 7.6 శాతం వృద్ధి సాధించింది. అక్టోబర్‌లో GST Collections కూడా గత ఏడాదితో పోలిస్తే 22.9 శాతం పెరిగి రూ.2.31 లక్షల కోట్లకు చేరాయి. పండుగల సీజన్లో పెరిగిన వినియోగం, దిగుమతులకు సంబంధించిన పన్నుల వసూళ్లు దీనికి దోహదపడ్డాయని నివేదిక పేర్కొంది. Capital Goods, Electrical Equipment, Automobiles, IT Services, Export-oriented రంగాలకు రానున్న రోజుల్లో మెరుగైన అవకాశాలు ఉండవచ్చని అంచనా వేసింది. అయితే NBFCలు, Housing Finance సంస్థలకు పెరుగుతున్న Funding Costs సవాలుగా మారవచ్చని తెలిపింది.
ద్రవ్యోల్బణం పెరుగుదలే అసలు టెన్షన్
మరోవైపు ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. సెప్టెంబర్‌లో 5.54 శాతంగా ఉన్న Retail Inflation అక్టోబర్‌లో 6.09 శాతానికి పెరిగింది. దీంతో RBI నిర్దేశించిన 6 శాతం గరిష్ఠ పరిమితిని దాటింది. Food Inflation 8.94 శాతానికి చేరగా, సెప్టెంబర్‌లో Wholesale Inflation 11.39 శాతంగా నమోదైంది. ఈ పరిణామాలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఇంకా కొనసాగుతున్నాయని సూచిస్తున్నాయి. BWR అంచనా ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో CPI Inflation 5.8 నుంచి 6.1 శాతం మధ్య గరిష్ఠ స్థాయికి చేరవచ్చు. నాలుగో త్రైమాసికంలో క్రమంగా 5 శాతానికి తగ్గే అవకాశం ఉంది. దీంతో ఏడాది సగటు ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉండొచ్చని నివేదిక పేర్కొంది. మొత్తంగా దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగా కనిపిస్తున్నప్పటికీ, ఇంధనం వంటి దిగుమతులపై ఆధారపడటం, ధరల ఒత్తిళ్లు, వడ్డీ రేట్ల పెరుగుదల వంటి అంశాలు రానున్న రోజుల్లో కీలకంగా మారనున్నాయి.