స్టాక్ మార్కెట్లలో మళ్లీ ఉత్సాహం

06-11-2026 | 10:18am

స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు.. సెన్సెక్స్ 443 పాయింట్ల ర్యాలీ

ముంబై, నవంబర్ 6: దేశీయ Stock Marketలు శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. ప్రారంభంలో కొంతసేపు ఒడిదుడుకులు ఎదురైనా, Foreign Fund Inflows కొనసాగడం, అంతర్జాతీయ మార్కెట్‌లో Crude Oil Prices మితంగా ఉండటం ఇన్వెస్టర్లలో ఆశలు పెంచాయి. తొలుత BSE Sensex 33 పాయింట్లు పెరిగి 79,343.06 వద్ద ట్రేడింగ్ ప్రారంభించగా, NSE Nifty 52.95 పాయింట్లు నష్టపోయి 24,477.40 వద్ద కొనసాగింది. అయితే కొద్దిసేపటికే కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు పుంజుకున్నాయి. తదుపరి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 443.87 పాయింట్లు లాభపడి 79,760.10 స్థాయికి చేరింది. నిఫ్టీ కూడా 81 పాయింట్లు పెరిగి 24,612.85 వద్ద ట్రేడయింది. ప్రారంభ నష్టాలు, లాభాల మధ్య ఊగిసలాడిన సూచీలు ఆ తర్వాత పుంజుకోవడం మార్కెట్‌లో సానుకూల వాతావరణాన్ని సూచించింది.

మరిన్ని వార్తలు