అమెరికా అధ్యక్ష పీఠంపై లింకన్.. చరిత్రలో నవంబర్ 6
1860 నవంబర్ 6న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అబ్రహం లింకన్ విజయం సాధించారు. ముగ్గురు ప్రత్యర్థులతో పోటీ పడిన ఆయన అమెరికా 16వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తం 303 ఎలక్టోరల్ ఓట్లలో 180 ఓట్లు సాధించారు.
స్టీఫెన్ డగ్లస్, జాన్ బ్రెకిన్రిడ్జ్, జాన్ బెల్లను వెనక్కి నెట్టి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. బానిసత్వ విస్తరణ (Slavery Expansion) అంశం ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశంగా నిలిచింది. లింకన్ విజయం (Abraham Lincoln Victory) అమెరికా రాజకీయ, సామాజిక చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది. ఈ ఎన్నికల ఫలితం అనంతరం అమెరికాలో బానిసత్వంపై జరిగిన రాజకీయ పరిణామాలకు కొత్త దిశ ఏర్పడింది.