‘స్వచ్ఛందం’గా వెళ్లిపోండి
మరో 60వేల మందికి మైక్రోసాఫ్ట్ ఎగ్జిట్ ప్యాకేజీ
భారత్‌లోని ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఐటీ రంగంలో(IT Sector) ఉద్యోగాల కోతలు(Job cuts) కొనసాగుతున్నాయి. ఎప్పుడు పింక్ స్లిప్(Pink slip) వస్తుందోనన్న కలవరం టెకీలను వెంటాడుతున్నది. తాజాగా మైక్రో సాఫ్ట్(Microsoft) మరోసారి ‘స్వచ్ఛందం’గా వెళ్లిపోండంటూ స్పెషల్ ప్యాకేజీని(Special Package) ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద 60వేల మంది ఉద్యోగులకు ఇంటికి పంపే పని పెట్టుకున్నది. ఈ మేరకు సోమవారం అధికారంగా ప్యాకేజీని ప్రకటిం చింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో నాల్గో వంతు ఎంప్లాయీస్‌కు ఇది వర్తించనుంది.
అమెరికా, కెనడా, బ్రిటన్‌తోపాటు భారత్‌లో(India) పనిచేస్తున్న వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగులతోపాటు కింది స్థాయి ఉద్యోగులకు ఈ వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీని అమలు చేయ నున్నట్లు కంపెనీ తెలిపింది. డేటా సెంటర్లు, సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లోని వారికి మా త్రం వర్తించదని పేర్కొంది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు 2లక్షల 28వేల మంది ఉద్యో గులు ఉండగా.. ఈ ఏడాది జూన్ నాటికి ఆ సంఖ్య 2లక్షల 23వేలకు పడిపోయింది. ప్రస్తుతం ప్రకటిం చిన ప్యాకేజీతో మరో 27శాతం మంది వెళ్లిపోనున్నారు.