నందివాడలో దుర్గామాత వద్ద అన్న ప్రసాదం

14-10-2026 | 06:28pm

తాడ్వాయి,అక్టోబర్,14( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో బుధవారం నేతాజీ దుర్గా సేవా సమితి(Netaji Durga Seva Samiti) ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ దుర్గా సేవ సమితి ప్రతినిధులు ముందుగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదం తయారు చేశారు.

ఈ ప్రసాదాన్ని భక్తులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఈ సమితి ఆధ్వర్యంలో దుర్గామాత ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని  తెలిపారు.ప్రతి సంవత్సరం అన్న ప్రసాదం అందిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు