దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం!

07-11-2026 | 01:44pm

కరీంనగర్ క్రైం, నవంబర్ 7 (విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్‌కు చెందిన దివ్యాంగుడు కళ్ళేపల్లి శివ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. తీగల వంతెన సమీపంలో దోమల నివారణకు ఉపయోగించే ద్రవం (All Out) తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆత్మహత్యాయత్నానికి ముందు శివ చిత్రీకరించిన సెల్ఫీ వీడియో (Selfie Video)లో బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు చేశాడు. తన అన్న బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న కారణంగానే కార్పొరేటర్ తమ కుటుంబాన్ని రాజకీయంగా వేధిస్తున్నారని ఆరోపించాడు. తమ ఇంటిని కూల్చివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను శివ విజ్ఞప్తి చేశాడు. రాజకీయ విభేదాల కారణంగా తమ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ ఘటన కిసాన్ నగర్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. శివ చేసిన ఆరోపణలపై సంబంధిత కార్పొరేటర్ స్పందన తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ (Police Investigation) చేపట్టి ఆరోపణల్లోని వాస్తవాలను తేల్చాల్సి ఉంది.

మరిన్ని వార్తలు